Tuesday, November 10, 2009

పితృ సూక్తు[దు]లు - పిల్లకాయలకు మాత్రమె

అందరికీ ఇవే నా మంగిడీలు. ఉభయ కుశలోపరి.

అసలు కధ మొదలెట్టాలి అంటె, అది నన్ను ఇంట్లొ నుండి హాస్టల్ కి గెంటేసిన రోజులు. ఒక నెల హాస్టల్ లొ టార్చరు అనుభవించాక ఆనందంగా గడుపు దామని శెలవులకి ఇంటికి వచ్చాను. ట్రైన్ దిగిన వెంటనే నాన్న కనిపించారు, అంతె, శ్రీశైలంలొ డ్యాం గేట్లు ఎత్తెస్తె కృష్ణా నది ఎలా పొంగి పొర్లుతుందో అలా నా కళ్ళలో నుండి, మా నాన్న కళ్ళలో నుండి, కనీళ్ళు పొంగాయి. ఎప్పుడు వచ్చారో తెలీదు కాని, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నీళ్ళ పంపు ఏక్కడ స్టార్ట్ అయ్యిందొ అని బిందెలతొ సహా దిగి పొయి నెనంటె నేను ఫష్ట్ అని కొట్టేసుకొవటం మొదలెట్టెసారు. వాళ్ళకి అమ్మా, అయ్యా ఇవి కన్నీళ్ళు కాని గొదారి నీళ్ళు కాదు అని మేయరు గారు కలగచెసుకోక పొయుంటె , దొరికిందే ఛాన్స్ అని అక్కడున్న కంకుల్ని, ఈనాడు, సాక్షి పేపర్లన్నీ తగలపెట్టి మరీ మా ఊరి నీళ్ళ వ్యధని తెలిపుండెవారు ఆయనకి.

సర్లెండి అది అలా ఉంచితె ఇంటికి రాంగానె, మా అమ్మ కూడా అలాంటి సీను ఎక్కడ క్రియెట్ చెస్తుందో అని నేను బయపడితె ఆవిడెమొ బకెటుడు నీళ్ళిచ్చి నువ్వు ఆ కార్ డ్రైవరు కాళ్ళు కడుక్కొని ఇంట్లొకి రండి అంది సింపుల్ గా. ఇంతలొ ఇంకో పెద్ద బకెటు వచ్చింది, నేను ఇది ఎవరికి అని అడిగాను, కారుకి అని సమాదాణం వచ్చింది. ఇదెదో మా అమ్మ గొంతులా లేదే అని తల పైకెత్తి చూసాను. ఎదురుగా వరుణగారు "బాగున్నావా ప్రశాంత్" అంది ప్రేమగా, దెబ్బకు జడుసుకుని చచ్చా. కారు డ్రైవరెమో అది విని టైడ్ యాడ్ లొని పిల్లల్లాగ అవాక్కయ్యాడు. కారు టైర్లు కడగటం ఎంటో, ఈమె గోలెంటో, అర్దం కాక ఆంటి మీ ఎస్.వి.ఆర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి అమెని అక్కడ నుండి తప్పించేసాను.

హాస్టలులొ వెశాక, మొదటి సారి ఇంటికి వచ్చాను కదా అని నాన్న, రారా అలా సరదాగ బయటకి వెళ్ళొద్దాం అని అన్నారు. నేను కూడా పొలోమని వెళ్ళబొతుంటె పిల్లి ఎదురొచ్చింది, ఒక్కక్షణం ఆగుదామనుకున్నాను కాని, సర్లె అది కూడ నాలాగా ఎక్కడికైన వెళ్తుందెమొనని, లైట్ తీసుకున్నాను. తీర వెళ్ళాక దారిలొ మొదలెట్టారు మా నాన్న గారు " ఓరై ఇప్పుడు నువ్వు పదవ తరగతి, ఈ ఒక్క సంవత్సరం బాగా చదువితె చాలు ఇంక జీవితం అంతా సంతొషంగా జీవిచ్చొచు. పదవ తరగతిలొ 500 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తె ఇంక నీ లైఫ్ సెటిల్ అయినట్టె. అదే నువ్వు ఇంకా కష్టపడి చదివితె నీకు ఐ.ఐ.టి సీట్ కూడా వస్తే ఇంక నీకు జీవితంలొ ఎదురుండదు రా. సొ నువ్వు ఈ సంవత్సరం సాంగీక, సామాన్య, లెక్కలు మీదె కాకుండా ఆంగ్లం, తెలుగు, హింది కూడా బాగా చదువు ....... తర్వతా ఎం చెప్పారొ నేను విన్లెదో, నాకు వినపడలెదో తెలిదూ కాని మళ్ళీ వినేటప్పటికి వచ్చె సంవత్సరం ఐ,ఐ,టి సెక్షనులొ వుండాలి అని అన్నారు. నేను కోలుకునేసరికి నాలుగు కిమిలు గ్రౌండ్ చుట్టూ తిరిగెసాం. ఇంటికి వచ్చాకా, ఎదో ఆ పాటి స్పీచ్ కె నాకు టెంత్ లో స్తేట్ ఫస్ట్ వచ్చినట్టు ఫెసెట్టారు మా నాన్న గారు. మా అమ్మ ఎమైందండీ వీడికి అని పరుగుపెట్టుకుంటూ నా దెగ్గరికి వచ్చింది. " బాద్యతలు తెలుసుకున్నాడె" అన్నారు నాన్న. నేను జరిగింది చెప్పాను అమ్మకి.

దసరా సెలవులకి ఇంటికి వచ్చాను. రేపు తమ్ముడు కూడ వస్తాడురా అంది అమ్మ. తల మీద స్నానం చెస్తుంటే ఎవరో నా షాంపూ తీసెసారు. అమ్మ షాంపూ ఎదే ఇక్కడ అని అరిచానో లెదో వరుణ గారు కుంకుండు కాయల పాకెట్ పట్టుకొచ్చి నాకిచ్చింది. ప్రశాంత్ పండగలప్పుడు ఇలా కుంకుండు కాయలతో తల స్నానం చెస్తే చాల మంచిది అంట. ఆంటి మరి రసం తయారు చెయాలి కదా అంత టైం లేదు, ఈ సారికి లైటే.. రసమా నేను తయారు చెసి ఉంచుతాను నువ్వు ఈ లొపల ఈ కుంకుండు కాయలతో స్నానం చేసి వచ్చి తిను సరేనా అంది. అది కాదు ఆంటి కుంకుండు కాయల రసం గురించి మాట్లాడుతున్నాను. కుంకుండు కాయలతో రసం ఎంటి నీ మొహం నేను ఎంచక్కా నీకు మసాల వెసి చేస్తాను. అయ్యొ కర్మ కర్మ అనుకుంటూ ఎలగో అలా కుంకుండు కాయలు కొన్ని తల మీద వెసేసు కుని స్నానం చెసేసా.

ఈమె నుండి ఎలాగైన తప్పించుకొవాలి అని, నాన్న అలా సరదాగా మైసూర్ బొండాలు తినొద్దాం పదా అని, నేను, నాన్న ఆ పిల్లి బయలు దెరాం. ఆహా అనుకుంటూ ఒక బొండా అలా నొట్లొ పెట్టానొ లెదో, మా నాన్న అవునురా మీ క్లాసులొ నీ ర్యాంక్ ఎంతరా అని స్టార్ట్ చెసారు. ఐ.ఐ.టి కి ప్రిపేర్ అవుతున్నావా లేదా, ఎంత మంది మీ క్లాసు లొ, ఎమైనా పాటాలు అర్తం అవుతున్నాయా లేదా, అవ్వక పొతె మాస్టారు గారిని అడుగుతున్నావా లెదా. ఒరై అంట్ల వెదవ నిన్నేరా అడిగెది అని ఫటా ఫటా అని ఒక్క బొండా అయిపొయెలొపే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లొ వంద ప్రశ్నలు వెసేసారు. నేను ఒక సారి గుటకేసి టాపిక్ మారుద్దాం అని, బొండా బావుంది కదా నాన్న ఇంకొద్దిగ కారం తగిలితే ఆహా అమొఘం ! అన్నాను. మాతొ పాటు బొండా తింటున్న పిల్లి కూడా "నువ్వు ఇవాళ చచ్చావు పొరా" అనె టైపు లొ 'ఒక్క సారి పైకి అలా చూసింది. నేను నిన్ను అడిగిందేంటి, నువ్వు చెప్పెదేంటి అని మరో రౌండ్ మొదలెట్టారు మా నాన్న. ఈ లొపు అటుపక్కనుండి నా నేస్తం ఒకడు నన్ను చూసి పలకరిచబొయి మా నాన్న నా క్లాసు వాడికి ఎక్కడ ఇస్తాడొ అని పారిపోబొయి పట్టుబడ్డాడు.
పాపం వాడు ఎక్కడ ఫీల్ అవుతాడొ అని వాడికి కూడా ఒక రౌండ్ ప్రశ్నలు వేసి, అసలు ఇలా కాదు రా మీకు అందరికి ఒకేసారి మహసభ ఏర్పాటు చేసి క్లాస్ పీకుతాను ఆగండి అని బండి స్టార్ట్ చేసి నన్ను మరిచిపోయి మరీ, తెలుగు దేశం కార్యాలయానికి వెళ్ళాడు,
అమ్మా దొరికిందే ఛాన్స్ అని నేను మా ఫ్రెండ్ పరుగో పరుగు. వాడు ఒరై ఆ పిల్లి మీదేన ? మనని ఫాలొ అవుతుంది ఏంటి అని అడిగాడు. లెదురా బాబు పాపం అది మా ఇంట్లొ మేము లెమని మా నాయనమ్మ దాన్ని పెంచింది, అదెమొ మాలానె ఇంట్లొ ఉండెది. మా నాయనమ్మకి అది మా తాతగారె అని అదొ ఫీలింగ్ అంతె.
ఆ రోజు సాయంత్రం మా తమ్ముడు చాలా హ్యాపిగా ఆటొ దిగి ఇంట్లొకి రాబొతుంటె అమ్మ అడ్డొచ్చింది బకెటు నీళ్ళు పట్టుకుని. కాళ్ళు ఫస్ట్. వాడూ పాపం హాస్టల్ ఫస్ట్ టైం, సొ అది పెద్దగా షాక్ లా అనిపించలెదు వాడికి. ఆ రెత్రి మా నాన్న వాడిని, చిన్నా అలా సరదాగా వాకింగ్ కి వెల్దామా అని అడిగాడు, అంతె పడుకున్న పిల్లి ఒక్కసారిగా కెవ్వు మని అరిసింది, ఆ అరుపుకి నేను ఇంటి వెనుకాల నుండి పరుగెత్తుకుంటూ వచ్చి మరీ వాడిని ఆపలేకపొయను. పాపం వాడు, నేను ఇంకా చిన్నప్పటిలా డ్యాడి బండి మీద ఎవరిని తీసుకెల్తారో చూసుంకుందామా అనె ఆట అడుతున్ననెమో అని అనుకున్నట్టు ఉన్నాడు. ఎమైందో ఎమొ అని నేను మా పిల్లి ఇంటి ముందె కూర్చొనుండి పొయాం. మా అమ్మెమో అయ్యిందెదో అయిపొయింది నువ్వు నీ ఇశ్టం వచినట్టు చెసుకొ కాని తాత గారిని నాకియ్యి అని నాకు తొడుగా ఉన్న పిల్లిని తీసుకెళ్ళిపొయింది.
కాసేపటికి ఇద్దరూ వచ్చారు, వాడు నావైపు తిరిగి అలా ఆకాశంకేసి చూసి నుదిటిపై ఒక అడ్డ గీత గీసెసాడు, పాపం అనుకొవటం తప్ప నేను ఎమీ చెయలేకపొయాను. వాడు రెండో రోజె బట్టలు సదిరేసి ఎదో ఎగ్జాం వుంది అని చెప్పి పాపం హాస్టల్ కి వెళ్ళిపొయాడు. నేను అమ్మ పాపం వాడు వెళ్ళిపొయాడు అని బాద పడితే మా నాన్న గారెమో "దారిలోకొచ్చాడు వెదవ అని తెగ సంబరపడిపొయారు". ఎందుకనో మరి సడెంగా మా నాన్న గారికి ఎదో ఒకటి రాయాలి అని అనిపించిందంట, ఎదొ ఒకటి రాయటం ఎందుకని మాకిచ్చె సూక్తులన్నీ ఒక పుస్తకం గా రాసెస్తే పొలా అని రెండ్రొజులు నిద్రాహరాలు మాని మరీ రాశారు కింద పెర్కొనబడిన గ్రంధం.
పితృ సూక్తు[దు]లు.
ఈ మధ్య క్యాప్షన్ ఫాషన్ అయ్యిందని దీనికి కూడ పెట్టారు ఒకటి ... పిల్లలకి మాత్రమె అని.

అలా మొదలైన ఆయన గారి సూక్తులు ఈ గ్రంధం మూలముగ ఆగిపొయినవి. దీన్ని ప్రతీ రోజు ఒక సారి చదివితే, పిల్లలకి బాగా చదవాలి, బాగా పైకిరావలి అనే రకమైనటువంటి అలోచనలు పెంపొందించుకోవచ్చు అని మొన్న టి.వి. 1054 కి ఇచ్చిన ఇంటర్వులొ తెలిపారు మా నాన్న. ఈ పుస్తకం బాగా సేల్ అయ్యింది లెండి,

ఒక వేళ, కొంప దీసి, మీ ఇంట్లొ మా నాన్న గారు రాసిన పుస్తకం కనపడితె గనక, ఈ క్రింద తెలుపబడిన పరిస్తితిలలొ చచ్చినా దొరకకండి, కొన్నెళ్ళ అనుభవంతొ చెప్తున్నా తర్వాత మీ ఇశ్టం.
1) మా ఊర్ళొ అంటె స్టేషన్ దూరం కాబట్టి నేను కచ్చితంగా స్టేషన్ నుండి ఇంటికి వచ్చె దారిలొ దొరుకుతాను. సొ మీరు అలాంటి సిచ్యువెషన్ ని ఆటో పెరు చెప్పి తప్పించుకొండి,
2) వాకింగ్ కి కాని రన్నింగ్ కి కాని రమ్మనొచ్చు.
3) మీకిశ్టమైన తినుబండారాలు కాని ఇశ్టమైన వస్తువులు కాని కొనిస్తాననొచ్చు,
4) గుడికి గాని, షాపుకి గాని, కలిసి వెల్దాం అని అనొచ్చు.... ఇలాంటివి మరి ఎన్నొ ఉంటాయి జాగ్రత్త.
అయినా మన పిచ్చి గాని వాళ్ళు అనుకొవాలే గాని మనమెంతలొ దొరుకుతాం చెప్పండి, మన గురించి వాళ్ళకి తెలీదా.

వరుణ గారి "మడాచారం మామి" అనె పుస్తకం లోని కొన్ని రూల్స్ మీకొసం. ["మామి" అనె పదం తనకి "మోఘళి రేకులు" అనె సెరియల్ లొని ఒక క్యరెక్టర్ పెరు నచ్చితె అలా పెట్టెసింది లెండి,]
1. పెళ్ళి అనేది మన క్యాస్ట్ వాళ్ళతోనె.
7. ఇతరుల ఇళ్ళళ్ళొ తినెటప్పుడు మడి పాటించాలి
15. బల్లపై కాని, కుర్చీల పై కాని, టీపాయిపై కాని అన్నం తినకూడదు.
ఎ) సవరణ: కుషన్స్ తీసెసి కుర్చిపై కూర్చొవచ్చు, కింద కూర్చొలేని స్తితిలొ మాత్రమె.
ఏ) మినహాయింపు: టిఫ్ఫిన్స్ కి ఈ రూల్ నుండి మినహాయింపు. [నవంబరు 27 2007]
23. స్నానం చెస్తేనె వంట స్టార్ట్ చెయాలి.

మా హొం మినిస్టెర్ ఈ సారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు, వరుణ గారి మడి రూల్స్ లోని, నంబర్లు 7,23 అనే రూల్లని తాత్కాలికంగా 30 రోజుల పాటు ఎత్తెసె వుత్తర్వులు జారి చెసింది.

సర్లెండి ఇంక ఉంటాను.

Sunday, September 20, 2009

అమ్మ, వరుణ మరియు మారియా....

తెలుగు వారందరికి ఇవే నా మంగిడిలు,
ఎన్నాళ్ళ నుండో నేను కూడ తెలుగు లొ బ్లాగు రద్దామని అనుకుని, కనుక్కొని, పడుకొని, వినుకొని, చదువుకొని, ఇన్నాల్టికి ఆ ముచ్చట తీర్చెసుకుందామని రాయటం మొదలెట్టాను లేఖిని లొ.

మాదొక చిన్న టౌన్ లెండి. పెళ్ళైన కొత్తలోనె మా నాన్న చాల కష్టాలు పడి అర డజను అరటిపళ్ళు తిని మరీ సింగరేణి లొ జాబ్ సంపాదించారంట [ అనుకున్న వేయ్ట్ లెని వాళ్ళను అప్పట్లొ తీసుకునె వారు కాదంట సింగరేణి లొ, అందుకె అరటిపళ్ళు ఇన్స్టంట్ వేయ్ట్ కొసం :) ]. మా అమ్మకి సంప్రదాయం అన్నా, మడి అన్నా, అదో పిచ్చి ప్రేమ, అన్నం తినేటప్పుడు యెడమ చెయి కంచానికి తగలకూడదు, పండగ పూట షాంపూ వెశి రెండు సార్లు తలకి రుద్దాలి, కాళ్ళు మొకాలి దాకా తడిచె లాగా కడగాలి అని ఇలా ఎన్నొ రూల్స్ ఇంట్లో.

ఇవన్నీ మెము పుట్టిన ఐదు పది ఏళ్ళ వరకు ఎమి లెవు, అవి నేను మా తమ్ముడు వీధి లొ ఒక చెత్తొ క్రికెట్ ఆడుతూ ఇంకొ చెత్తొ, కాళ్ళు మొకాళ్ళ దాక కడుగుకోకుండ, పకొడీలు తినే రోజులు. మా అర నెక్కరు, తెల్ల బనియను, జీవితం చల్లటి గీతా ఐస్క్రీం లా కరిగిపొతుండగా,.......... ఒక రోజు అమ్మ చెసిన బజ్జీలు తిందామని మా తమ్ముడు గిన్న లొ చెయి పెట్టడొ లెదో మా అమ్మ అట్లకాడతొ వాడిని రెండు పీకింది. " బయట గాడిదల్లా యెగిరి వచ్చి కాళ్ళు చెతులు కడుక్కొకుండా ఎప్పుడైన బజ్జీలు తిన్నార్రా ? అని వాడివైపు కొపం గా చుసి, ఇలాంటి కొత్త అలవాట్లు ఎక్కడ నుండి నెర్చుకుంటారొ ఎంటొ వరుణ అని 180 డిగ్రీస్ తిరిగింది. అక్కడ ఒక అంటి కుర్చుని ఉంది, అమే వరుణ. కాళ్ళు కడుక్కుని వచ్చి తినండి అని అర్డర్ జారి చెసింది. వాడు నా వైపు తిరిగి, అదెదొ జెమిని టివి లొ కొత్తగా స్టార్ట్ అయిన అత్తా కొడళ్ళ సీరియల్ రెండు సంవత్సరాల్లొనె అయిపొయినట్టు ఒక సర్ప్రైస్ లుక్కిచ్చాడు.

చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చెసరికి మాకు బాగా ఆకలి వేసేది, అందుకని అమ్మ మేము వచ్చె సమయానికి అన్నం, కూరా ముద్దలుగా చేసి ఉంచెది. అది తినేసి మెము టూషన్ కి వెళ్ళె వాళ్ళం. ఆ రోజు కూడ అలానె వచ్చి అన్నం ముద్దలు తింటున్నాం. పొరపాటున నా టై కంచానికి తగిలింది, అంతె సడెన్ గా వర్షం పడుతున్నట్టు అనిపించిది, ఏంటా అని చూస్తె మా అమ్మ తినెటప్పుడు కంచానికి ఒన్లి కుడి చెయి మాత్రమే తగలాలి ఇంకేమైన తగిలితె ఇలా నీళ్ళు చల్లు కొవాలి దీన్నె మడి అని అంటారు అని చెప్పి, ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి అని ఒక పుస్తకం చెతిలొ పెట్టి ఇవి ఇవాల్టి నుండి మన ఇంట్లొ ఫాలొ అవుతున్నం అని ఉత్తర్వులు జారి చెసింది మా హొం మినిస్టర్ . అయ్యా ఇది ప్రతిపక్షాల కుట్ర అని మా నాన్న కి చెప్దాం అని వెళ్తె, ఆయన గారు అదెదొ సోనియా గాంది మన్మొహన్ సింగ్ కి "గొల్డెన్ రూల్స్ ఆన్ హౌ టు బి ఎ పప్పెట్ ప్రైం మినిస్టార్" అనే పుస్తకం ఇస్తె ఆయన ఎలా దీక్షగా చదువుతారొ అలా చదివెస్తున్నరు.

మీకు తెలుసా సోనియా గాంది పుస్తకం లొ రెండె లైన్స్ వున్నాయంట,
1) అత్యవసర సందర్భాల్లొ నన్ను సంప్రదించకుండా ఎలాంటి వ్యాక్యలు చేయకు.
2) మిగితా అన్ని సందర్భాలు నీకు అత్యవసరమైనవె.

సరె అదటు ఉంచితె, మా అమ్మ పుస్తకం లొ కొన్ని ముఖ్యమైన రూల్స్/పదకాలు ,
1) మనిషి జీవితంలొ మడి ఒక ముఖ్య భాగం.
2) స్నానం చెస్తెనే కూడు
3) ఒక రోజు గుడికి వెళ్ళకపొతె, ఇంట్లొ రెండొ రోజు ఉదయం పూజ చెయాలి.
4) ఇతరుల ఇంట్లొ తింటె మడి పాటించవలెను.
5) గుడ్డు కట్, పాకెట్ మని ఫట్ట్, సినిమాలు సట్ ఇలాంటివి మరెన్నో ......
అది చదివాక మా తమ్ముడు " ఎవడ్రా నిన్న స్వాతంత్ర దినొత్సవం అని చాక్లెట్లు పంచింది ? "- అని రజని కాంత్ సౌండ్ ఎఫ్ఫెక్ట్ తొ జుయ్ జుయ్ జుయ్ అని అమూడు సార్ళు నా వైపు తిరిగాడు,
పెద్దైయ్యాక పెద్దగా నేను తమ్ముడు ఇంట్లొ ఉండలేదు, ఆ వంక తొ హాస్టల్ నుండి వచ్చాక మడి గుడి అనే రూల్స్ కి బ్రేక్ వెశాం. అమ్మ పాపం మా మీద ప్రేమ వల్ల ఎమీ అనెది కాదు, కాని పొయిన సారి ఇండియా వెళ్ళీనప్పుడు ఇంట్లొ అడుగు పెట్టానొ లేదో "ఒరై అక్కడ చంబులొ వున్న నీళ్ళ తొ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రా అంది", అంతె ఎక్కడో ఎదో కొల్పొతున్న ఫీలింగ్ వచ్చింది, తర్వత ఆకలి వెస్తె అమ్మ ఆకలి అన్నాను అప్పుడు సమాదానం " స్నానం చెసిరా అంది", అంతె సినిమా లొ ఎదో సీనులా మెఘాలు మెరిసాయి, ఉరుములు, గాలి, దుమ్ము, ఎంటి ఈ విధి వైపరిత్యం అని చుస్తె దుమ్ము దులుపుకుంతూ, మెరుపులు తప్పించుకొటానికి కూలింగ్ గ్లాస్సెస్ అడ్డు పెట్టుకుని వరుణ గారు కళ్ళ ముందు దర్శణం ఇచ్చారు. ఈవిడ ఎంటి ఎప్పుడు ఇంట్లొ ఇలాంటి విచిత్రం జరిగినా ఇలా దర్శణం ఇచ్చెస్తుంది అని అలొచిస్తున్నంతలొ అప్పుడె ఒక మెరుపు మెరిసినట్టు నా మెదడు ఒక సిగ్నల్ పంపింది "ఒరై ఈవిడెరా వీటన్నిటికి కారణం అని".
ఇంతలొ మా నాన్న నన్ను పక్కకు పిలిచి ఒరై ఈవిడెరా మీ అమ్మ కొత్త నేస్తం వరుణ అని చెప్పాడు. వరుణెరా మన మడి పుస్తక రచయిత్రి. ఊరంతా ఒక రోజు పండగ చెస్తె ఈవిడ గారు తను రాసిన రన్‌టైం పంచాంగం తెచ్చి నెక్ష్ట్ డె అసలు ముహూర్తం అని నా చెత వాళ్ళాయిన చెత లీవ్ పెట్టించి మరీ పూజ చెయిస్తుంది రా అని వాపొయాడు. నేను మరి వాళ్ళింటి మన్ మొహన్ సింగ్ కి చెప్పకపొయావా అని అడిగాను, దానికి మా నాన్న "ఫిర్యదు చెశానురా కాని ఆయన పాత సినిమా లొ సూర్యకాంతం బర్త ఎస్.వి.ఆర్ లా నేనేం చెయగలను సార్ అన్న రెంజ్లొ చుసాడురా బాబు" అందుకె ఎమీ చెయలెక ఫాలొ అయిపొతున్నా" .
ఈ సారి దసరాకి ఇంటికి వెల్తున్నా మళ్ళి, సరదాకి ఎందుకో మా అమ్మని ఏడిపిద్దామని " అమ్మ ఈ సారి నువ్వు ఏయిర్ పొర్ట్కి రావొద్దు అని చెప్పా, ఎందుకురా అంది, తర్వాత చెప్తాను అన్నాను, లేదు నేను వస్తాను అంది అమ్మ, సరె నీ ఇశ్టంలె కాని నాతొ ఇంకొకరు వస్తున్నారు సర్ప్రైస్ కాకు అని చెప్పా, ఎవరురా ఎమి మాట్లాడుతున్నావ్, అంటే నేను ఒక అమ్మాయిని ఇక్కడ ప్రేమించాను, తను కూడా వస్తానంటే తీసుకొస్తున్నాను అని చెప్పా, అంతె, ఫొన్లొ ఎదో డ్యాం కూలిన శబ్దం, మా అమ్మ ఎడుస్తుంది, ఎమైందమ్మా అని అడిగా నవ్వుతూ, ఎంట్రా ఇలా పరువు తీసె పని చెసావ్, నేను మీ నాన్న ఎలారా ఇప్పుడు తలెత్తుకుని తిరిగెది, ఇలా చెశావ్ ఎంట్రా ?, అని ఒకటే ఎడుపు, సర్లె కాని అమ్మాయిది మన కులమేన అని అడిగింది, లెదు గ్రీకులు కదమ్మా క్రిస్టియన్స్ అని చెప్పా, అంతె శంకరాబరణం శాస్త్రిలా ఒక ఇరవై పెజీల రూల్స్ ఉల్లంగణ గురించి చెప్పింది. నువ్వు జాబ్ రిసైన్ చెసి ఇంటికి వచ్చెయ్, నీ మీద తక్షణమె చెర్యలు చేపట్టెలా మీ నాన్న గారిపై వత్తిడి తెస్తాను అని సీరియస్ గా చెప్పింది, నేను... అమ్మ మరి ఎలెనా సంగతి అంటె అదెవరు రా అని అరిసింది. మీ కొడలు పిల్ల అని సెంటెన్సె కంప్లీట్ చెసానొ లెదొ, ఇంకొసారి అలాంటి పెరు వినపడిందొ నేను ఫ్లయ్ట్ ఎక్కాల్సివస్తుంది అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
ఇంక వద్దులె, అని లెదమ్మా ఊరికె అన్నాను ఎలెనా లెదు పిలేన లెదు. దానికి తను నాకు తెలుసురా నేను ఊరికే నటించాను, వరుణ గారి పుస్తకం చదివాక కూడ నువ్వు ఇలాంటి పనులు చెయలేవు అని వెరీ కంఫిడెంట్ గా చెప్పింది.
ఈ వరుణ గారి మీద ఇంత నమ్మకం ఎంటే తల్లి, ఆ నమ్మకం పొగొట్టడానికెనే ఈ సారి మారియని తీసుకొనివస్తున్నా అని చెప్పి ఫొన్ కట్ చెశా :). అనుకుంటాం గానండి చదువుకునే రోజుల్లొ పర్లెదురా నాకెం ప్రాబ్లం లెదు అమ్మాయి మంచిదైతె చాలు అని "నేను ప్రేమిస్తె ఎంచెస్తావ్ అమ్మ అని అడిగితె వచ్చె సమాదానం నిఝంగా చెప్తె ఎందుకు రాదో మరి...

సర్లెండి ఇంక ఉంటాను.......